తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ తన 20వ చిత్రాన్ని తెలుగు దర్శకుడు కే.వి అనుదీప్ దర్శకత్వంలో చేయనున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, శాంతి టాకీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ ఇచ్చారు చిత్రబృందం. మూవీ టైటిల్ ను, శివకార్తికేయన్ ఫస్ట్ లుక్ ను రివీల్ చేస్తూ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. సూపర్ స్టార్ మహేష్ బాబును అభిమానులు ప్రేమతో పిలుచుకునే "ప్రిన్స్" టైటిల్ తో ఈ సినిమా రూపొందుతుంది. ఇక పోస్టర్ విషయానికొస్తే, ప్రపంచశాంతిని కోరుకునే ప్రచారకర్తగా శివకార్తికేయన్ కనిపిస్తారు. వైట్ గ్లోబ్, డోవ్ , మొత్తం అంతా వైట్ థీమ్ తో పోస్టర్ పీస్ ఫుల్ గా ఉంది. విభిన్నమైన కధాకధనాలతో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అని పోస్టర్ ను బట్టి క్లియర్ గా తెలుస్తుంది. కే.వి అనుదీప్ 2016లో వచ్చిన పిట్టగోడ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తరవాత ఆయన చేసిన జాతిరత్నాలు సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాతో ఆయన తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.