కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార జీవితంలో నిన్న ఒక మధురమైన ఘట్టం జరిగింది. ఆరేళ్లుగా ప్రేమిస్తున్న డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను నయన్ వివాహం చేసుకుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు, ఇండస్ట్రీ సెలెబ్రిటీల సమక్షంలో విఘ్నేష్ తో కలిసి నయన్ ఏడడుగులు నడించింది. ఈ వేడుకకు కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, హీరో కార్తీ, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, డైరెక్టర్ అట్లీ, ప్రీతీ విజయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. ఐతే, ఈ వేడుకలో ఒక్క టాలీవుడ్ సెలెబ్రిటీ కూడా లేకపోవడం విచిత్రం. నయనతార పేరుకి మలయాళీ అయినా తమిళ సినిమాలే ఎక్కువగా చేసింది. కోలీవుడ్, మాలీవుడ్ లలో కన్నా నయన్ టాలీవుడ్ లోనే ఎక్కువ పేరును, క్రేజును, డబ్బును సంపాదించింది. టాలీవుడ్ లో నయన్ క్రేజు ఆమె కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారడానికి పూల బాట వేసింది. అలాంటిది తెలుగు చిత్రపరిశ్రమ కు చెందిన ఒక్క సెలెబ్రిటీని కూడా నయన్ ఆహ్వానించకపోవడం నిజంగా విచిత్రమే.
నయన్ పెళ్ళిలో షారుఖ్ ఖాన్ సందడి చేసిన విషయం అందరికి తెలిసిందే. అట్లీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న జవాన్ సినిమాలో షారుఖ్ కు జోడిగా నయన్ నటిస్తుంది...కాబట్టే ఆయన్ను పెళ్ళికి ఆహ్వానించింది. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ లో కూడా నయన్ ఫిమేల్ లీడ్ లో నటిస్తుంది. మరి చిరంజీవి ని ఎందుకు పిలవలేదు? టాలీవుడ్ అంటే నయన్ కు ఎందుకంత చిన్న చూపు? అని కొంతమంది కొత్త పెళ్లికూతురును ఆడిపోసుకుంటున్నారు.