శివ కార్తికేయన్ హీరోగా సిబి చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "డాన్".ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. జై సూర్య, సముద్ర ఖని, సూరి కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవి చందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం నేటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది.