న్యాచురల్ స్టార్ హీరో నాని, నజ్రియా నజీమ్ ( కాంబినేషన్‌లో వస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికి’. వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రం జూన్ 10న శుక్రవారం థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైటెక్‌సిటీ శిల్ప కళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు మేకర్స్. ఈవెంట్‌కు పవన్ కల్యాణ్ చీఫ్ గెస్టుగా హాజరయ్యాడు.ఈ సందర్భంగా నజ్రియా మాట్లాడుతూ..ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్ సార్ రావడం సంతోషంగా ఉంది. హైదరాబాద్‌లో నేను థియేటర్‌లో చూసిన ఫస్ట్ సినిమా భీమ్లానాయక్. భీమ్లానాయక్ సినిమా ఓ మ్యాజిక్. నాకు అద్బుతమైన థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కలిగింది. అంటే సుందరానికి లాంటి అందమైన చిత్రంలో నన్ను భాగస్వామి చేసినందుకు డైరెక్టర్ వివేక్ ఆత్రేయకు ధన్యవాదాలు. మనమంతా రేపు థియేటర్‌లో కలుద్దామని చెప్పుకొచ్చింది నజ్రియా. ఈ చిత్రంలో రోహిణి, నరేశ్, విష్ణువర్దన్ కీలక పాత్రల్లో నటించారు