రెమో, వరుణ్ డాక్టర్, కౌసల్య కృష్ణమూర్తి వంటి సినిమాలతో తమిళ హీరో శివ కార్తికేయన్ తెలుగు ప్రజలకు సుపరిచితుడే. ఆయన నటించిన సినిమాలు తెలుగులో కూడా డబ్ అవుతుంటాయి. ఈ మధ్యనే ఆయన "డాన్" చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు. విలక్షణ దర్శకుడు ఎస్ జె సూర్యతో కలిసి శివకార్తికేయన్ ఇందులో నటించారు. ఈ చిత్రంలో ప్రియాంక మోహనన్ కధానాయిక. తమిళ దర్శకుడు అట్లీ శిష్యుడు శిబి చక్రవర్తి దర్శకుడిగా పరిచయమౌతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ తో కలిసి శివ కార్తికేయన్ నిర్మించారు. వరసగా 7వ సారి శివ కార్తికేయన్ సినిమాకి అనిరుధ్ సంగీతం అందించారు. ఈ సినిమాలో సముద్ర ఖని, సూరి లు కీలక పాత్రల్లో నటించారు.
ఇటీవల థియేటర్ల లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అయ్యింది. నేటి నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ మొదలెట్టింది. తెలుగు, తమిళ, మలయాళ మరియు కన్నడ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమ్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa