ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సత్యదేవ్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ కు యూట్యూబులో వీక్షణల వెల్లువ

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 10, 2022, 03:30 PM

అసక్రమంగా ఉన్న ప్రభుత్వంపై, ఆ ప్రభుత్వంలో పని చేసే అవినీతి రాజకీయ నాయకులపై యంగ్ హీరో సత్యదేవ్ చేసిన పోరాటమే గాడ్సే. సత్యదేవ్ గత చిత్రాలు బ్లఫ్ మాస్టర్, తిమ్మరుసు, స్కై ల్యాబ్ సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో సత్యదేవ్ నుండి రాబోతున్న కొత్త చిత్రం గాడ్సే పై ప్రేక్షకుల అంచనాలు భారీగా పెట్టుకోవడమే కాకుండా, వేకళ్ళతో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. సత్యదేవ్ రగ్డ్ లుక్, ప్రభుత్వాన్ని నిలదీస్తూ సత్యదేవ్ చెప్పే పవర్ ఫుల్ డైలాగులు వీక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ ట్రైలర్ కు యూట్యూబులో వీక్షణలు వెల్లువలా కురుస్తున్నాయి. నిన్న విడుదలైన ఈ ట్రైలర్ కు యూట్యూబులో మూడు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ విషయాన్ని పేర్కొంటూ మూవీ టీం అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేసింది. 


ఈ చిత్రానికి గోపీగణేష్ పట్టాభి దర్శకత్వం వహించారు. సీకే స్క్రీన్స్ బ్యానర్ పై సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 17, 2022 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa