రెజీనా కస్సాండ్రా ..ఒకప్పుడు టాలీవుడ్ లో బాగా వినబడిన పేరు. తన అందం, అభినయం తో చేసిన కొన్ని సినిమాలతోనే ఎందరో ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్న రెజీనా తెలుగులో సినిమా చేసి చాలా కాలమే అవుతుంది. తాజాగా ఆమె లీడ్ రోల్ లో నటించిన ఒక వెబ్ సిరీస్ తెరకెక్కింది. "అన్య ట్యూటోరియల్" అనే హార్రర్ వెబ్ సిరీస్ లో రెజీనా, నివేదితా సతీష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ టీజర్ ను డార్లింగ్ ప్రభాస్ విడుదల చేసారు. టీజర్ ఆద్యంతం ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. తరవాత ఏం జరగబోతుందనే ఇంటరెస్ట్ ను ప్రేక్షకుల్లో కలిగించడంలో మేకర్స్ దాదాపు విజయం పొందినట్లే. ఈ వెబ్ సిరీస్ ను తెలుగు ప్రధమ ఓటిటి ఆహా తెలుగు , తమిళ భాషలలో రూపొందించింది. జూలై 1 నుండి ఈ హార్రర్ వెబ్ సిరిస్ ఆహా లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ కు పల్లవి గంగిరెడ్డి దర్శకత్వం వహించారు.