టాలీవుడ్ యంగ్ హీరో అడవిశేష్ లీడ్ రోల్ లో నటిస్తూ, రచయితగా కూడా పని చేసిన చిత్రం మేజర్. శశి కిరణ్ తిక్కా డైరెక్షన్లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా తెరకెక్కిన ఈ మూవీ ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. ప్రీమియర్ షోలతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మేజర్ కు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు దక్కుతున్నాయి. ఈ సినిమా నిర్మాణంలో భాగమైన ప్రతి ఒక్కరికి చేతినిండా లాభాలే. ఈ వీకెండ్ కు కలెక్షన్లు మరింత ఎక్కువగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశప్రజల హృదయాలను గెలుచుకోవడంతో పాటు ఎంతోమంది సెలెబ్రిటీలను సైతం ఫిదా చేసింది. తాజాగా మేజర్ చిత్రాన్ని మెచ్చుకుంటూ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 2008 ముంబై దాడుల్లో పోరాడిన వారిలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఒకరని, ఆయన జీవిత చరిత్రే మేజర్ మూవీ అని, అడవి శేష్, సయీ మంజ్రేకర్, శశికిరణ్ తిక్కా, మహేష్ బాబులకు శుభాకాంక్షలు తెలుపుతూ బిగ్ బి ట్వీట్ చేసారు.