టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, రాశిఖన్నా జంటగా నటించిన చిత్రం థాంక్యూ. విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో విభిన్న కధాంశంతో తెరకెక్కిన ఈ మూవీ కి తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసారు.
ఈ సినిమాలో అవికాగోర్, మాళవికా నాయర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం జూలై 8వ తేదీన ప్రేక్షకులను పలకరించడానికి సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవలే టీజర్ తో ఆకట్టుకున్న థాంక్యూ చిత్రబృందం తాజాగా సినిమాలోని మొదటి లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసింది. మారో మారో అని సాగే ఈ పాట హీరో కాలేజ్ లైఫ్ లో , క్రీడా నేపథ్యంతో సాగుతుంది. ఇందులో చైతు హాకీ ప్లేయర్ గా కనిపిస్తాడు. ఈ పాటతో మరోసారి తమన్ తన మ్యూజిక్ పవరేంటో చూపించాడు. ఈ పాటకు కిట్టు విస్సప్రగడ సాహిత్యాన్ని అందించగా, దీపూ , పృథ్వి చంద్ర ఆలపించారు. ర్యాపొ ని మాహా అందించారు.