మాజీ ఎంపీ, హీరోయిన్ రమ్య(దివ్య స్పందన) తెలుగు, కన్నడ, తమిళ సినిమాల ద్వారా ఎంతో మంది ప్రేక్షకులకు ఆమె సుపరిచితురాలిగా మారింది. ఇటీవల రాజకీయాలకు దూరంగా ఉంటోంది. ఇక కన్నడ స్టార్ రక్షిత్ సినిమా 'చార్లీ 777' ప్రివ్యూ గురువారం చూసి, అది బాగుందంటూ ట్వీట్ చేసింది. దీనిపై ప్రీతమ్ ప్రిన్స్ అనే నెటిజన్ అసభ్య కామెంట్లు పెట్టాడు. అతడు తరచూ సోషల్ మీడియాలో తనను వేధిస్తున్నాడమని ఆమె కేసు పెట్టింది. పోలీసులు విచారిస్తున్నారు.