తెలుగు ప్రేక్షకులు మరియు సినీ ప్రేమికులకు ఎంఎస్ రాజు గురించి పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన కెరీర్‌లో భారీ చిత్రాలను నిర్మించాడు. "7 డేస్ అండ్ 6 నైట్స్" అనే కొత్త సినిమాకి దర్శకుడిగా మారిన సంగతి అందరికి తెలిసిందే. సుమంత్ అశ్విన్ మరియు మెహర్ చావల్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీ జూన్ 24, 2022న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈరోజు ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ యూత్‌ఫుల్ ఎలిమెంట్స్‌తో బోల్డ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా కనిపిస్తుంది. సుమంత్ అశ్విన్, రజనీకాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సమర్థ్ గొల్లపూడి సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa