రమేష్ కదుముల దర్శకత్వంలో లక్ష్ చదలవాడ హీరోగా పరిచయమైన సినిమా వలయం. 2020లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే హీరోగా లక్ష్ కు మంచి పేరొచ్చింది.
తాజాగా లక్ష్ హీరోగా గ్యాంగ్ స్టర్ గంగరాజు అనే చిత్రం తెరకెక్కుతుంది. ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలనే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ జూన్ 24న తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన లిరికల్ సాంగ్స్, టీజర్ తో సినిమాపై తగిన బజ్ క్రియేట్ అయ్యింది. తాజాగా ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ట్రైలర్‌ని జూన్ 12వ తేది సాయంత్రం 7 గంటలకు విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం అనౌన్స్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa