నాచురల్ స్టార్ నాని, నజ్రియా నాజిమ్ జంటగా నటించిన చిత్రం అంటే సుందరానికి. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. డీసెంట్ టాక్ తో రన్ అవుతున్న ఈ మూవీ కలెక్షన్లకు జురాసిక్ వరల్డ్ సినిమా గండి కొడుతుందని తెలుస్తుంది. 1993లో జురాసిక్ పార్క్ తో ప్రారంభమైన సిరీస్ లో ఇప్పటివరకు మొత్తం ఆరు చిత్రాలు వచ్చాయి. ఈ సిరీస్ కు జురాసిక్ వరల్డ్ డొమినియన్ చిత్రంతో ముగింపు పలికారు. ఈ చిత్రం కూడా ఇటీవలే విడుదలై భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఈ మూవీపై ఉన్న క్రేజ్ తో జనాలు ధియేటర్లకెళ్ళకుండా ఉండలేకపోతున్నారు. దీంతో జురాసిక్ వరల్డ్ కు సమకాలీనంగా రిలీజైన అంటే సుందరం మూవీ ఈ వీకెండ్ పరిస్థితి ఓవర్సీస్ లో అగమ్యగోచరంగా ఉంది. అంతేకాక సుందరానికన్నా థియేటర్లకు ముందుగా వచ్చిన విక్రమ్, మేజర్ ల పోటీని తట్టుకుని ఈ వీకెండ్ లో భారీ కలెక్షన్లు రాబట్టాం సుందరానికి కత్తిమీద సాము లాంటిది. ఇన్ని గండాల మధ్య సుందరం తొలి వీకెండ్ ను ఎలా గట్టెక్కుతాడో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa