ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధాకడ్ ఫలితాన్ని గాలికొదిలేసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న కంగనా

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 11, 2022, 09:15 PM

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇటీవలే ఏజెంట్ అగ్నిగా ప్రేక్షకులను పలకరించింది. రజనీష్ ఘాయ్ డైరెక్ట్ చేసిన "ధాకడ్" లో కంగనా ఏజెంట్ అగ్నిగా లీడ్ రోల్ ను పోషించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ కరువవడంతో థియేటర్లలో నాలుగు రోజులు కూడా రన్ అవ్వలేకపోయింది. డిస్ట్రిబ్యూటర్లను, నిర్మాతలను నిలువెత్తునా నష్టాల్లో ముంచేసింది ఈ చిత్రం. ఇవేమి పట్టని కంగనా జాలిగా వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. వేసవి లో సేద తీరడానికి  కుటుంబంతో సహా తన సొంతూరు, ఇష్టమైన ప్రదేశం మనాలి లో వాలిపోయింది. అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను కంగనా తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలను చూసిన కొంతమంది ధాకడ్ మూవీ ఫలితాన్ని, నిర్మాతల బాధలను ఏమాత్రం పట్టించుకోకుండా ఎలా ఎంజాయ్ చేస్తుందో? అంటూ ఆడిపోసుకుంటున్నారు. చిరంజీవి కూడా కంగానాలానే ఆచార్య రిలీజైన వెంటనే, ఆ ఫలితాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా అమెరికాకు చెక్కేసిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa