ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీడియా ముందుకొచ్చిన నవదంపతులు

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 11, 2022, 09:16 PM

కోలీవుడ్ లేడి సూపర్ స్టార్ నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తమ ఆరేళ్ళ ప్రేమ బంధానికి నిన్ననే పెళ్లి రూపమిచ్చారు. కుటుంబం, స్నేహితులు, సన్నిహితులు హాజరవగా, పెద్ద ఎత్తున డెకరేట్ చేసిన పెళ్లి మండపంలో నయన్, విఘ్నేష్ ల వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం అంగరంగ వైభవంగా జరిగింది. నిజానికి వీరి పెళ్లి తిరుమల తిరుపతిలో జరగాల్సింది కానీ, కొన్ని కారణాల వల్ల ఆ ఆలోచనను విరమించుకున్న నయన్-విఘ్నేష్ లు అలా పెళ్లి చేసుకున్నారో లేదో ఇలా శ్రీవారి దర్శనానికి తిరుపతికి పయనమయ్యారు. పెళ్ళికి ముందు జరిగిన ప్రెస్ మీట్లో విఘ్నేష్ శివన్ ప్రామిస్ చేసిన ప్రకారమే ఈ రోజు నయన్ తో కలిసి తొలిసారి భార్య భర్తలుగా మీడియా ముందుకు వచ్చారు. పసుపు రంగు చీరలో, తేలికపాటి నగలతో, నుదుటున కుంకుమతో కొత్త పెళ్లికూతురు నయనతార ముఖంలో వచ్చిన కొత్త కళతో వెలిగిపోతుంది. నయన్- విఘ్నేష్ లు ఇద్దరు మీడియాతో కలిసి కొద్దిసేపు ముచ్చటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa