బ్రూస్ లీ, సాహో చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన కోలీవుడ్ స్టార్ హీరో అరుణ్ విజయ్ 'యానై' అనే మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. స్టార్ డైరెక్టర్ హరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో 'ఎనుగు' పేరుతో విడుదల చేస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామా జూన్ 17, 2022న థియేటర్లలో విడుదల కానుంది అని కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, జూలై 1, 2022న సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పై మూవీ మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, రామచంద్రరాజు, రాధిక శరత్‌కుమార్, యోగి బాబు, అమ్ము అభిరామి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సతీష్ కుమార్ నిర్మించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa