సౌత్ నుండి కేజీఎఫ్2, ఆర్ ఆర్ ఆర్ వంటి బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఘనవిజయం సాధించాయో అందరికి తెలిసిన విషయమే. నార్త్ నుండి రాబోతున్న అలాంటి బిగ్ బడ్జెట్ ప్రాజెక్టు బ్రహ్మాస్త్ర. ఇందులో రణ్ బీర్ కపూర్, ఆలియాభట్ జంటగా నటించారు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసారు. ధర్మ ప్రొడక్షన్స్ తో కలిసి స్టార్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మించింది. బాలీవుడ్ కా బాహుబలి అని పిలవబడుతున్న ఈ చిత్రం పట్ల నార్త్, సౌత్ అనే తేడా లేకుండా ప్రతి చోటా పాజిటివ్ వైబ్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో విడుదల కావడానికి తయారవుతుంది. ఇదిలా ఉండగా, ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఇటీవలే అధికారికంగా ప్రకటించిన బ్రహ్మాస్త్ర చిత్రబృందం, తాజాగా చిరు డబ్బింగ్ చెప్తున్న వీడియోను రిలీజ్ చేసింది. డబ్బింగ్ చెప్పడానికి వచ్చిన చిరును అయాన్ ముఖర్జీ బొకే ఇచ్చి, ఆశీస్సులు తీసుకున్నారు. ఈ మూవీ ట్రైలర్ జూన్ 15వ తారీఖున రిలీజ్ కాబోతుంది.
Brahmāstra gets the power of Chiranjeevi Garu’s voice for its release in Telugu!
We are grateful to the Megastar for being a part of Brahmāstra in this very special way.
Watch out for his voice and for our Trailer on June 15th!#Brahmastra pic.twitter.com/Gt63Rd1ch3
— BRAHMĀSTRA (@BrahmastraFilm) June 13, 2022
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa