ఎప్పుడో మార్చిలో విడుదలైన రాజమౌళి డైరెక్టోరియల్ ఆర్ ఆర్ ఆర్ కు ఇప్పటివరకు క్రేజ్ తగ్గలేదంటే, ఆ సినిమా పట్ల ప్రేక్షకులు ఎంతటి అభిమానాన్ని చూపిస్తున్నారో అర్ధం చేసుకోవాలి. సినిమా థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని ఓటిటి లోకి అడుగు పెట్టిన తరవాత ఆర్ ఆర్ ఆర్ క్రేజ్ మరింత పెరిగింది. ఈసారి విదేశీయుల నుండి ఆర్ ఆర్ ఆర్ కు ప్రశంసలు వస్తున్నాయి. విదేశీ ఆడియన్స్ నుండి స్పెషల్ అటెన్షన్ ను గ్రాస్ప్ చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇటీవలే అమెరికాలో రీరిలీజ్ అయ్యింది. పలువురు హై ప్రొఫైల్ సెలెబ్రిటీస్, టాప్ హాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఆర్ ఆర్ ఆర్ ను చూసి సోషల్ మీడియాలో తమ రివ్యూను పేర్కొన్నారు.
తాజాగా సాఫ్ట్ వేర్ కంపెనీ క్యాప్ జెమినీ చైర్మన్ పాల్ హెర్మేలిన్ తన ఇండియన్ ఫ్రెండ్స్ కు ఆర్ ఆర్ ఆర్ లోని నాటు నాటు స్టెప్ ను ఛాలెంజ్ చేస్తూ లింక్డ్ ఇన్ లో పోస్ట్ పెట్టారు. నాటు నాటు పాటలో తారక్, చెర్రీ లు వేసిన హుక్ స్టెప్ కు మాక్సిమమ్ మ్యాచ్ అయ్యేలా డాన్స్ వెయ్యమని తన ఇండియన్ ఫ్రెండ్స్ కు రిక్వెస్ట్ చేస్తూ పాల్ చేసిన పోస్టును ఆర్ ఆర్ ఆర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.
The Chairman of @Capgemini posted about Naacho Naacho on his LinkedIn and challenged his Indian friends to match our duo's dance!
Hope you had a great trip to India, Paul Hermelin... #RRRMovie pic.twitter.com/23by86W50v
— RRR Movie (@RRRMovie) June 13, 2022
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa