బాలీవుడ్ మాజీ ప్రేమ జంట రణ్ బీర్ కపూర్, దీపికా పదుకొణె ఒకప్పుడు కలిసి సినిమాలు చేసారు. వెకేషన్ లకెళ్లారు. పార్టీలు ఎంజాయ్ చేసారు. అంత బాగానే ఉంది కదా ఇంకేముంది త్వరలోనే పెళ్లి పీటలెక్కుతారనుకునే క్రమంలో, ఇద్దరూ విడిపోయినట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్త ఇద్దరి స్టార్ల ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరిచింది. ఇక అప్పటినుండి వీరిద్దరూ కలిసి ఏ సినిమాలోనూ నటించలేదు. బ్రేకప్ తర్వాత దీపికా రణ్ వీర్ సింగ్ ను, రణ్ బీర్ కపూర్ ఆలియాభట్ ను పెళ్లి చేసుకుని ఎవరి జీవితాల్లో వారు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ విచిత్రమేమిటంటే, దీపికా పదుకొణె, ఆలియాభట్ మంచి స్నేహితులు. రణ్ బీర్ - దీపికా కాంబోలో వచ్చిన చివరి సినిమా 2015లో అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో వచ్చిన ఏ జవానీ హై దివాని. ఇప్పుడదే డైరెక్టర్ చేసిన ఒక సినిమాలో దీపికా పదుకొణె స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తుందని టాక్. ఎవరో సినిమా అయితే ప్రేక్షకులు అంతగా పట్టించుకునే వారు కాదేమో కాదు కానీ, దీపికా స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చేది తన మాజీప్రియుడి సినిమాలో కావడంతో ఈ వార్త హాట్ టాపిక్ గా నిలిచింది. అయాన్ ముఖర్జీ - రణ్ బీర్ కపూర్ కాంబోలో తెరకెక్కిన బ్రహ్మాస్త్ర లో దీపికా స్పెషల్ గెస్ట్ రోల్ పోషించిందని, ఆమె పాత్ర బ్రహ్మాస్త్ర సీక్వెల్ కు దారితీస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో ఆలియాభట్ హీరోయిన్. స్నేహితురాలు ఆలియా , ఫ్రెండ్ లాంటి దర్శకుడు అయాన్ ముఖర్జిల సినిమా కాబట్టి దీపికా చేసిందా? లేక మాజీ ప్రియుడి మీద ఉన్న అభిమానంతోనా? అని బాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. అసలు బ్రహ్మాస్త్ర లో దీపికా నటించిందా? లేదా ? అన్న విషయం తెలియాలంటే, చిత్రబృందం అధికారిక ప్రకటన వెలువరించేంత వరకు ఆగాల్సిందే.