దేశవ్యాప్తంగా ప్రస్తుతం హాట్ టాపిక్ గా నిలిచిన చిత్రం మేజర్. టాలీవుడ్ యంగ్ హీరో అడవిశేష్, సయీ మంజ్రేకర్ జంటగా, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా తెరకెక్కిన ఈ మూవీని "గూఢచారి" ఫేమ్ శశికిరణ్ తిక్కా డైరెక్ట్ చేసారు. జూన్ 3వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా ఈ మూవీని ప్రతి ఒక్కరూ తమ హృదయాలకు హత్తుకున్నారు. అన్ని భాషల విమర్శకుల ప్రశంసలు అందుకొని శేష్ కెరీర్ లోనే ఒక బిగ్గెస్ట్ ఎవర గ్రీన్ అండ్ ఎమోషనల్ హిట్ గా నిలిచింది ఈ చిత్రం. ఆర్మీలో చేరాలనుకుంటున్న యువతకు చేయూతను ప్రకటించిన మేజర్ టీం తాజాగా స్కూల్స్ మరియు పిల్లలకు సంబంధించి ఒక వినూత్న ప్రకటన ఈ రోజు చేయనున్నట్టు అడవిశేష్ ట్వీట్ చేసారు. ఈ అప్డేట్ ఏంటి? ఎందుకు? అన్నది సాయంత్రంలోపు తెలియనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa