"తులసి" మూవీ నుంచి 'నీ కళ్ళతోటి నా కళ్ళలోకి' పాట లిరిక్స్:
నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం
నీ చూపుతోటి నను తాకుతుంటే తనువంతా సూర్యోదయం
ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓ వరం
అలాగే అలాగే ప్రపంచాలు పలికే కథవ్వాలి మనమిద్దరం

అడుగునౌతాను నీవెంట నేను… తోడుగా నడవగా చివరిదాకా
గొడుగునౌతాను ఇకపైన నేను… వానలో నిన్నిలా తడవనీక
నిన్నొదిలి క్షణమైనా అసలుండలేను… చిరునవ్వునౌతాను పెదవంచున
నీ లేత చెక్కిళ్ళ వాకిళ్ళలోనే… తొలి సిగ్గు నేనవ్వనా
నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం
నీ చూపుతోటి నను తాకుతుంటే తనువంతా సూర్యోదయం
ఆ.. వెన్నెలౌతాను ప్రతి రేయి నేను… చీకటే నీదరికి చేరకుండా
ఊపిరౌతాను నీలోన నేను.. ఎన్నడు నీ జతే వదలకుండా
నా రాణి పాదాలు ముద్దాడుకుంటూ… నేనుండి పోతాను పారాణిలా
చిరుచెమట పడుతుంటే నీ నుదుటి పైన… వస్తాను చిరుగాలిలా