తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల తన కొత్త ప్రాజెక్ట్‌ను నెల్సన్ దిలీప్ కుమార్ తో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ మరో ప్రధాన పాత్రలో నటించనున్నట్టు సమాచారం. ఈ చిత్రం ఆగష్టు లో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాలో రజినీకాంత్ కి జోడిగా ఐశ్వర్యరాయ్ నటిస్తుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి 'బాస్' అనే టైటిల్ ని లాక్ చేయటానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు లేటెస్ట్ టాక్. రజనీకాంత్ కూడా ఈ టైటిల్‌కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది అని ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానిని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అనిరుధ్ రవిచందర్ దీనికి సంగీతం అందిస్తున్నారు.