టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో కిరణ్ అబ్బవరం ఒక్కరు. ఈ హీరో ప్రస్తుతం రొమాంటిక్ లవ్ స్టోరీ ట్రాక్ లో రానున్న 'సమ్మతమే' సినిమాలో కనిపించనున్నారు. చాందిని చౌదరి ఈ సినిమాలో కిరణ్ సరసన జంటగా నటిస్తోంది. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని భావిస్తున్నారు. జూన్ 24, 2022న ఈ సినిమా థియేటర్లలో విదుదల కానుంది. తాజా అప్డేట్ ప్రకారం, ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను జూన్ 16, 2022న సాయంత్రం 04:05 గంటలకు విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇదే విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీతం అందించారు. యుజి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కంకణాల ప్రవీణ ఈ సినిమా నిర్మిస్తున్నారు.
![]() |
![]() |