సూరరై పొట్రు (ఆకాశం నీ హద్దు రా) సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సుధా కొంగర కొన్ని రోజుల క్రితం ఈ సినిమా హిందీ రీమేక్‌ని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అండ్ రాధిక మదన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఒరిజినల్ సినిమాలో నటించిన సూర్య హిందీ రీమేక్‌లో అతిధి పాత్రలో నటిస్తున్నట్లు లేటెస్ట్ టాక్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అండ్ అతని భార్య జ్యోతిక ఈ చిత్రాన్ని 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అబుండాంటియా ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.