దగ్గుబాటి రానా, సాయిపల్లవి జంటగా నటిస్తున్న విరాటపర్వం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ఈవెంట్ కు ముఖ్య అతిధిగా విక్టరీ వెంకటేష్ హాజరై, విరాటపర్వం మూవీ టీం కు శుభాకాంక్షలను తెలియచేసారు. ఎప్పుడూ లేనివిధంగా వెంకటేష్ రానాపై ప్రశంసల వర్షం కురిపించారు. రానా తొలి సినిమా "లీడర్"తో మొదలు పెట్టి, విరాటపర్వం సినిమా వరకు, రానా ఎంచుకునే కధలు, వాటిలోని తన పాత్రలు నన్ను బాగా ఇంప్రెస్ చేసాయి. కెరీర్ లో తప్పకుండా విజేతగా నిలుస్తాడు... బహుశా అనుకున్నంత వెంటనే జరగకపోవచ్చు...కానీ జరగడం మాత్రం పక్కా... అంటూ అబ్బాయ్ రానా పై బాబాయ్ వెంకటేష్ గర్వపడుతూ వ్యాఖ్యానించారు. అలానే సాయి పల్లవి గురించి మాట్లాడుతూ.. ఆమె నవ్వు చాలా క్యూట్ గా ఉంటుందని, తప్పకుండా నేషనల్ అవార్డు విన్నర్ అవుతుందని చెప్పారు. తన మార్కు "అంతేగా అంతేగా" డైలాగు తో వెంకటేష్ తన స్పీచ్ ను ముగించారు. విరాటపర్వం సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.