ఇటీవలే సెబాస్టియన్ పీసీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, ఆ సినిమాతో భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. SR కళ్యాణమండపం తో సంచలన విజయం సాధించిన ఈ యంగ్ హీరో తిరిగి సక్సెస్ ట్రాక్ లోకి రావటానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం కిరణ్ నుండి రావడానికి సమ్మతమే సినిమా రెడీగా ఉంది. ఇంకా వినరో భాగ్యము విష్ణు కధ సెట్స్ పై ఉంది. ఇవి కాకుండా కిరణ్, రచయిత - డైరెక్టర్ రత్నం కృష్ణ తెరకెక్కిస్తున్న "రూల్స్ రంజన్" అనే మూవీలో హీరోగా నటిస్తున్నాడు. స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సూర్య మూవీస్ బ్యానర్లపై AM రత్నం నిర్మిస్తున్న ఈ మూవీలో కిరణ్ కు జతగా "డీజే టిల్లు" ఫేమ్ నేహా శెట్టి ఎంపికైందని మేకర్స్ తాజాగా ఎనౌన్స్ చేసారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమంతో లాంఛనంగా ప్రారంభమై, రెగ్యులర్ షూటింగును జరుపుకుంటుంది. ఈ సినిమా లో గోపరాజు రమణ, ఆశిష్ విద్యార్ధి, అజయ్, జెమినీ సురేష్, తులసి, అభిమన్యు సింగ్, వైశాలి, హిమని, జయవాణి, ముంతాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.