కొత్తగా లేడి పవర్ స్టార్ ట్యాగ్ తగిలించుకున్న టాలీవుడ్ నాచురల్ బ్యూటీ సాయి పల్లవి విరాట పర్వం సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతుంది. వేణు ఉడుగుల డైరెక్షన్లో, 1990ల కాలంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రానా, సాయి పల్లవి జంటగా నటించారు. భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కాబోతున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ ను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సాయి పల్లవి క్రేజ్, రానా ప్రెజెన్స్, డైరెక్టర్ టేకింగ్ ఈ సినిమా విజయానికి ఎంతవరకు కారణమవుతాయో తెలియాలంటే ఇంకొన్ని గంటలు వెయిట్ చెయ్యాలి.
ఈ సినిమాకు కనక హిట్ టాక్ వచ్చిందంటే, సాయి పల్లవి ఖాతాలో హ్యాట్రిక్ హిట్ పడినట్టే. గతేడాది సాయి పల్లవి నుండి వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. నాగచైతన్య "లవ్ స్టోరీ", నాని "శ్యామ్ సింగ రాయ్" చిత్రాలు సూపర్ హిట్ అవ్వడమే కాక పల్లవి క్రేజును మరింత పెంచేసాయి. లవ్ స్టోరీ, శ్యామ్ సింగ రాయ్ సినిమాల తర్వాత పల్లవి నుండి రాబోతున్న విరాట పర్వం కూడా హిట్ అవ్వాలని, పల్లవి హ్యాట్రిక్ కొట్టాలని ఆమె అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.