సుదీర్ఘ విరామం తర్వాత ప్రఖ్యాత యాంకర్ సుమ కనకాల లీడ్ రోల్ లో నటించిన చిత్రం "జయమ్మ పంచాయితీ". విడుదలకు ముందు ఈ సినిమాపై ఉన్న బజ్ అంతా ఇంతా కాదు. ప్రమోషన్స్ ను కూడా చిత్రబృందం హై రేంజులో చేసింది. దీంతో సినిమా హిట్టవ్వడం ఖాయమని అంతా అనుకున్నారు...తీరా సినిమా విడుదలైన తర్వాత సీన్ మొత్తం రివర్స్. సుమ క్రేజుతో ఈ సినిమా లాభాల పంట పండిస్తుందనుకున్న నిర్మాతలకు ప్రేక్షకులు మొండిచేయి చూపించారు. థియేటర్లలో ప్రేక్షకులు కరువయ్యారు... బాక్సాఫీస్ వద్ద జయమ్మ..డిజాస్టర్ గా నిలిచింది. జయమ్మ పంచాయితీ తర్వాత సుమతో మెయిన్ లీడ్ చేయిస్తామంటూ కొంతమంది నిర్మాతలు ఆమెను అప్రోచ్ అయ్యారట. అయితే, వారు చెప్పే కధలను వినడానికి సుమ ఇంటరెస్ట్ చూపించట్లేదట. జయమ్మ నేర్పిన పాఠంతో మరోసారి ఇలాంటి మెయిన్ లీడ్ ప్రయోగాలు చేసి నిర్మాతలకు భారం కాకూడదని సుమ యాక్టింగ్ కెరీర్ ను హోల్డ్ లో పెట్టిందని టాక్. కానీ, స్టార్ హీరో సినిమాలలో, టాప్ డైరెక్టర్ సినిమాలలో ఛాన్స్ వస్తే మాత్రం కాదనకుండా చెయ్యాలని అనుకుంటుందట. చూద్దాం...ఏ స్టార్ హీరో తన సినిమాలో సుమకు ఛాన్స్ ఇస్తాడో!