మానాడు, మన్మధ లీలై సినిమాల వరస సక్సెస్ జోష్ తో, తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తన తదుపరి సినిమాను టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య తో ఉంటుందని ఇటీవలే ఎనౌన్స్ చేసాడు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కబోతుంది. ఈ సినిమాతో చైతు తమిళ సినీరంగ ప్రవేశం చేస్తున్నాడు. ఈ నెల 23వ తేదీ నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవబోతుందని తెలుస్తోంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్ పై లేటెస్ట్ బజ్ ఒకటి ఆసక్తిని రేకెత్తిస్తుంది. అదేంటంటే, చైతూ బై లింగువల్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఇద్దరు పని చెయ్యబోతున్నారు. అది కూడా తండ్రీకొడుకుల ద్వయం. వాళ్ళు మరెవరో కాదు ఇళయరాజా - యువన్ శంకర్ రాజా. ఈ తండ్రీకొడుకులు వెంకట్ ప్రభుతో చైతూ చేస్తున్న సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్స్ గా వ్యవహరిస్తారని టాక్ నడుస్తోంది. ఈ ఇద్దరు వెంకట్ ప్రభు కు దగ్గరి బంధువులు. జూన్ 12 నుండి మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయని తెలుస్తుంది. త్వరలోనే ఈ విషయమై చిత్రబృందం అధికారిక ప్రకటన చేయనుందట. ఈ మూవీలో చైతూకు వ్యతిరేక పాత్రలో కోలీవుడ్ నటుడు అరుణ్ విజయ్ నటిస్తారని తెలుస్తుంది. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్రబృందం త్వరలోనే అధికారికంగా ప్రకటించడానికి రెడీ అవుతుందట.