బ్రహ్మాస్త్రలో పౌరాణిక పాత్రతో గెస్ట్ రోల్ బాలీవుడ్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రం 'బ్రహ్మాస్త'. రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న ఈ చిత్రనికి ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. అమితాబ్ బచ్చన్, నాగార్జున ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో.. మరికొందరు బాలీవుడ్ స్టార్స్ గెప్పియరెన్స్ ఇవ్వనున్నారు. షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు ఇప్పటికే ప్రచారం కాగా.. దీపికా పదుకోనకూడా గెస్ట్ రోల్ ప్లే చేసిందని టాక్. షారుఖ్ అండ్ దీపిక ఎంట్రీతో సినిమా సరికొత్త మలుపులు తిరగబోతోందని తెలుస్తుండగా.. ఎలాంటి పౌరాణిక పాత్రల్లో కనిపించబోతున్నారనే ఇంట్రెస్ట్ నెలకొంది.