కొద్దికాలం క్రితం వరకు కేవలం స్టార్ హీరోల సినిమాలే ఓవర్సీస్ లో విడుదలయ్యేయి..., ఆ సినిమాలే మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించేవి. ఇటీవల చిత్రపరిశ్రమలో వచ్చిన భారీ మార్పుల కారణంగా, చిన్న, మధ్య తరహా హీరోల సినిమాలు కూడా ఓవర్సీస్ లో విడుదలై, మిలియన్ డాలర్లను వసూలు చేస్తున్నాయి. నాని లాంటి నాచురల్ స్టార్ ఐతే, ఏకంగా స్టార్ హీరోలకు ధీటుగా, ఓవర్సీస్ లో విడుదలైన ప్రతి సినిమాతో మిలియన్ డాలర్ల క్లబ్ లోకి చేరి ఔరా! అనిపిస్తున్నాడు.
నాని నటించిన కొత్త చిత్రం అంటే సుందరానికి. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనెర్గా తెరకెక్కిన ఈ మూవీలో నాని, నజ్రియా జంటగా నటించారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం డీసెంట్ టాక్ తో ఇండియాలో రన్ అవుతుంటే, ఓవర్సీస్ లో మాత్రం వసూళ్ల వర్షం కురిపిస్తుంది. తాజాగా ఈ సినిమా ఒక మిలియన్ డాలర్ మార్కును క్రాస్ చేసింది. దీంతో మిలియన్ డాలర్ క్లబ్ లో నానివి 7 సినిమాలు ఉన్నట్టు.
గతంలో నాని నటించిన ఈగ, భలే భలే మగాడివోయ్, జెర్సీ, నిన్ను కోరి, MCA, నేను లోకల్ సినిమాలు ఒక మిలియన్ డాలర్ క్లబ్ లో ఉండగా, తాజాగా ఈ లిస్టులో అంటే సుందరానికి మూవీ కూడాచేరింది. ఓవర్సీస్ లో మిలియన్ మార్కు క్రాస్ చేసిన సినిమాలలో సూపర్ స్టార్ మహేష్ నటించిన సినిమాలే ఎక్కువ(11). మహేష్ తర్వాత 7 సినిమాలతో జూనియర్ ఎన్టీఆర్ ఉండగా, తాజాగా ఈ ప్లేస్ ను నాని కూడా షేర్ చేసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్, ప్రభాస్, బన్నీ, చెర్రీ వంటి అగ్రనటులను దాటుకుని నాని ఈ ఘనత సాధించడం నిజంగా గ్రేట్. ఈ లిస్టులో మహేష్, తారక్, నాని తరవాతి స్థానాల్లో పవన్ కళ్యాణ్(6), అల్లు అర్జున్ (5), ప్రభాస్(4), రామ్ చరణ్(3), విజయ్ దేవరకొండ(3), వరుణ్ తేజ్(3) ఉన్నారు.