రెండు వేర్వేరు సమయాల్లో ఇద్దరు స్టార్ సెలెబ్రిటీలను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిన కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ పలు కారణాల వల్ల ఆ రెండు పెళ్లిళ్లను విరమించుకుంది. గత ఆరేళ్లుగా తనను ఎంతో గాఢంగా ప్రేమిస్తున్న కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను జూన్ 9వ తారీఖున పెళ్లి చేసుకున్న నయనతార అప్పటినుండి కాస్త రెస్ట్ మోడ్ లోకి వెళ్లినట్టు తెలుస్తుంది. పెళ్ళైన వెంటనే తిరుపతి, కేరళ అని తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ నవదంపతులు. మరి, పెళ్లైపోయింది... నయన్ సినిమాలు చేస్తుందా?లేదా? అని అభిమానులు పిచ్చ టెన్షన్ లో ఉన్నారు.
ప్రస్తుతానికైతే, నయన్ తను కమిటైన ప్రాజెక్టులను ఖచ్చితంగా పూర్తి చేయవలసి ఉంది. ఈ నేపథ్యంలో అట్లీ డైరెక్షన్లో షారుఖ్ ఖాన్ నటిస్తున్న "జవాన్" మూవీలో నయన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ గత నెలలోనే ప్రారంభంగా కాగా, నయన్ వివాహం వల్ల కాస్త బ్రేక్ ఇచ్చారు. త్వరలోనే హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చెయ్యబోతున్నారు జవాన్ మూవీ టీం. ఈ షెడ్యూల్ లో నయన్ కూడా పాల్గొనాల్సి ఉంది. ఈ మేరకు మరో రెండు రోజుల్లో కొత్త పెళ్లికూతురు నయన్ హైదరాబాద్ కు హయ్ చెప్పనుంది. నయన్ నటించాల్సిన మరో సినిమా "గాడ్ ఫాదర్". మోహన్ గాంధీ డైరెక్షన్లో మలయాళ మూవీ లూసిఫర్ కు తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీ లో మెగాస్టార్ కు జోడిగా నయన్ నటిస్తుంది. ఇవికాక, భర్త విఘ్నేష్ డైరెక్షన్లో రూపొందనున్న ఒక మూవీలో తాలా అజిత్ సరసన నయన్ కథానాయికగా నటించాల్సి ఉంది.
ఇవన్నీ చూస్తుంటే, 37ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకున్న నయన్ ఫ్యామిలీ ప్లానింగ్ పై ఎలాంటి దృష్టి పెట్టనట్టు తెలుస్తుంది. కానీ కొంతమంది అభిప్రాయం ప్రకారం, కొత్త ప్రాజెక్టులను ఒప్పుకోకుండా, ఆల్రెడీ కమిటైన ప్రాజెక్టులను పూర్తి చేసి ఆపై ఫ్యామిలీ మీద ఫోకస్ పెట్టాలని అనుకుంటుందట నయన్. ఈ విషయంలో నయన్ తన కన్నా ముందు పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్, సోనమ్ కపూర్, కరీనా కపూర్ ఖాన్ లను ఆదర్శంగా తీసుకున్నట్టు తెలుస్తుంది. వీరు కూడా పెళ్లి చేసుకున్న వెంటనే బ్రేక్ ఇవ్వకుండా సినిమాల్లో నటిస్తూ, ఆ తర్వాత కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టారు. కరీనా ఇద్దరు పిల్లలకు తల్లైన తర్వాత రీఎంట్రీ ఇవ్వగా, ఇటీవలే తల్లిగా మారిన కాజల్ రీఎంట్రీ ఇచ్చే ప్రయత్నాల్లో బిజీగా ఉంది. ఇక, సోనమ్ ప్రస్తుతం గర్భధారణను ఎంజాయ్ చేస్తుంది. ఆమె కూడా తల్లైన తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్సులు మెండుగా కనిపిస్తున్నాయి. వీరి దారిలోనే ప్రయాణించాలనుకుంటున్న నయన్ కూడా రెండు మూడేళ్లకు సినీ కెరీర్ కు బ్రేక్ ఇచ్చి ఆపై ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తుందని అంటున్నారు. చూద్దాం.. ఫ్యూచర్ లో ఏం జరగబోతుందో.