కరోనా పుణ్యమా అని ఓటిటీలు వెలుగులోకి వచ్చాయి. సినిమాలు, డాక్యుమెంటరీలు, వెబ్ సిరీస్ లు అనే తేడా లేకుండా సరికొత్త కంటెంట్ లతో తమ సబ్ స్క్రైబర్లను అలరించడానికి ఓటిటి సంస్థలు తీవ్రంగా కష్టపడుతున్నాయి. ఈ నేపథ్యంలో జీ 5 ఓటిటి లో తెలుగు, తమిళం, హిందీ కన్నడం, మలయాళం వంటి భారతదేశ భాషల్లో వివిధ ఫార్మాట్ లలో ఫ్రెష్ కంటెంట్ అందుబాటులోకొస్తుంది. ఇటీవలే గాలివాన అనే వెబ్ సిరీస్ తో అలరించిన జీ 5 ఓటిటిలో తాజాగా మరో తెలుగు వెబ్ సిరీస్ "రెక్కీ" స్ట్రీమ్ అవుతుంది.
సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ పై కే వి శ్రీరామ్ నిర్మించిన వెబ్ సిరీస్ రెక్కీ. జూన్ 17 నుండి జీ 5 ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది. గ్రామీణ ఫ్యాక్షన్ క్రైం డ్రామాగా రూపొందిన రెక్కీ 7 ఎపిసోడ్ల తో సబ్ స్క్రైబర్లను అలరించనుంది. ఇందులో "రోజాపూలు" ఫేమ్ శ్రీరామ్, శివబాలాజీ, ధన్య బాలకృష్ణ, ఎస్తేర్ కీలక పాత్రలు పోషించారు.
పోలూరు కృష్ణ దర్శకత్వం లో,1990 ల నాటి బ్యాక్ డ్రాప్ లో నడిచిన క్రైం థ్రిల్లర్ గా రెక్కీ వెబ్ సిరీస్ కు నెటిజన్ల నుండి విశేష స్పందన వస్తుంది. ప్రతీ ఒక్కరి నటన మరియు అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో రెక్కీ అత్యుత్తమ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లలో ఒకటిగా నిలిచింది.