బాలీవుడ్ ప్రేమ జంట రణ్ బీర్ కపూర్ , ఆలియా భట్ లు ఈ మధ్యనే వివాహబంధంతో ఒక్కటయ్యారు. కుటుంబసభ్యులు, అతికొద్దిమంది
స్నేహితుల సమక్షంలో వీరి పెళ్లి ఏప్రిల్ 14 న సింపుల్ అండ్ స్వీట్ గా జరిగింది.పెళ్ళికి ముందు నుండి కూడా కపూర్ కుటుంబంతో ఆలియా సత్సంబంధాలు కొనసాగించింది.
రణ్ బీర్ తల్లి నీతూ కపూర్, చాలా కాలం తర్వాత నటిస్తున్న చిత్రం జగ్ జగ్ జీయో. ఇందులో వరుణ్ ధావన్, కియారా అద్వానీ మెయిన్ లీడ్స్ కాగా, అనిల్ కపూర్, నీతూ కపూర్ సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో విలేఖరులు, కొత్త కోడలు ఆలియా గురించి నీతూ ను అడగ్గా, ఆమె చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పెళ్లి తర్వాత తన కొడుకులో మార్పు వచ్చిందని, ఆ మార్పును తాను ఫీల్ అవుతున్నానని చెప్పారు. ఆలియా తన స్వచ్ఛమైన ప్రేమతో రణ్ బీర్ ను పూర్తిగా మార్చేసిందని, కపూర్ల ఫ్యామిలీ కి ఆలియా వంటి అందమైన, తెలివైన, ప్రతిభ గల కోడలు రావడం నిజంగా అదృష్టమని తెలిపారు. ఇన్నాళ్లు తన కొడుకు పెళ్లి కాలేదు, పెళ్లి కాలేదు అని తెగ బాధపడిపోయేవాడని ....ఎట్టకేలకు బంగారం లాంటి భార్యను సాధించాడని చెప్పారు. దీంతో అక్కడి వాతావరణం మొత్తం నవ్వులమయమైంది.