దేశవ్యాప్తంగా ప్రస్తుతం హాట్ టాపిక్ గా నిలిచిన చిత్రం మేజర్. టాలీవుడ్ యంగ్ హీరో అడవిశేష్, సయీ మంజ్రేకర్ జంటగా, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా తెరకెక్కిన ఈ మూవీని "గూఢచారి" ఫేమ్ శశికిరణ్ తిక్కా డైరెక్ట్ చేసారు. జూన్ 3వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా ఈ మూవీని ప్రతి ఒక్కరూ తమ హృదయాలకు హత్తుకున్నారు. అన్ని భాషల విమర్శకుల ప్రశంసలు అందుకొని శేష్ కెరీర్ లోనే ఒక బిగ్గెస్ట్ ఎవర్ గ్రీన్ అండ్ ఎమోషనల్ హిట్ గా నిలిచింది ఈ చిత్రం.
మేజర్ మూవీ సక్సెస్ లో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శేష్ మాట్లాడుతూ.... పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్ళు రోజూ పోరు పెడుతున్నారని, అలాంటమ్మాయి, ఇలాంటమ్మాయి కావాలని అనుకున్న వాళ్ళు కాస్త కనీసం ఏదో ఒకమ్మాయినైనా పెళ్లి చేసుకొమ్మని చెప్పే స్థాయికి వచ్చేశారని శేష్ చెప్పారు. పెళ్లి టాపిక్ వచ్చిన ప్రతిసారి, ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ వంటి ఎందరో నటీనటులు పెళ్లి చేసుకోకుండా ఉన్నారని వారికి సమాధానం ఇస్తూ ఉంటానని చెప్పారు. దీంతో సల్మాన్ కు పెళ్లి కాకున్నా కొన్ని లవ్ స్టోరీలను నడిపారు...అలా మీకేమన్నా ఉన్నాయా? అని విలేఖరి అడగ్గా, వెంటనే శేష్ స్పందిస్తూ... ఇప్పటివరకు ఆయనలా బ్రహ్మచారిలా ఉన్నాను కానీ, ఆయనలా లవ్ స్టోరీలు మాత్రం నడపలేదు. అమెరికాలో ఉన్నప్పుడు ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాను. దురదృషమేంటంటే...నా పుట్టినరోజునాడే ఆ అమ్మాయికి మరొకరితో వివాహం జరిగిపోయింది. అప్పటినుండి నా లైఫ్ లో ప్రేమ కు స్థానం లేదు... అని చెప్పుకొచ్చారు.