దర్శకుడు లోకేష్ కనగరాజన్‌పై విశ్వనటుడు కమల్ హాసన్ ప్రశంసలు కురిపించాడు. కమల్ హీరోగా ఇటీవల తెరకెక్కిన 'విక్రమ్' సినిమాకు లోకేష్ దర్శకత్వం వహించారు. తన సొంత నిర్మాణ సంస్థతో కమల్ హాసన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా కారణంగా తనకు ఊహించని లాభాలు వచ్చాయని, అప్పుల నుంచి గట్టెక్కానని ఆయన పేర్కొన్నారు. దర్శకుడు లోకేష్‌కు ఏం కావాలన్నా చేసేందుకు తాను సిద్ధమని తెలిపారు. ఇప్పటికే రూ.కోటి విలువైన కారును గిఫ్ట్‌గా అందించారు.