ఆర్ ఆర్ ఆర్ వంటి క్రేజీ పాన్ ఇండియా సక్సెస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ తో తన ముప్పైవ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. తారక్ పుట్టినరోజు నాడు ఆయన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ పై సెన్సేషనల్ అప్డేట్స్ వచ్చాయి. ఒకేసారి రెండు సినిమాల అప్డేట్లు రావడంతో నందమూరి అభిమానులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. కొరటాలతో 30వ సినిమాను ప్లాన్ చేసిన తారక్, 31వ సినిమాను పాన్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఉంటుందని ప్రకటించి అందరిని ఆశ్చర్యాల్లో ముంచెత్తాడు.
ఈ రెండు సినిమాల తర్వాత ఒక తమిళ దర్శకుడికి తారక్ ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఆయన సాదాసీదా డైరెక్టర్ కాదు...,నేషనల్ అవార్డు విన్నర్ ఐన డైరెక్టర్ వెట్రిమారన్. ఆడుకలం, విసరనై, వడ చెన్నై,అసురన్ వంటి ఇంటెన్స్ మూవీలకు డైరెక్టర్ గా ఆయన పని చేసారు. ఇటీవలే తారక్ కు ఒక ఇంటెన్స్ స్టోరీ లైన్ ను వినిపించిన వెట్రిమారన్, వెంటనే తారక్ తో ఓకే చెప్పించుకున్నాడట. ఒక ప్రముఖ నిర్మాత వీరి సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తానని ముందుకొచ్చారట. త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటనతో ప్రేక్షకుల ముందుకు రానున్నారని వినికిడి.