బాలీవుడ్ బ్యూటీ హీనా ఖాన్ స్పెషల్ షో చేసింది. బ్లాక్ గౌనులో అందాలు ఆరబోసింది. వెరైటీ భంగిమల్లో కెమెరా ముందు పోజులు కొట్టింది. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ శ్రీనగర్ బ్యూటీ టీవీ సీరియల్స్ తో పాపులర్ అయింది. ఫియర్ ఫ్యాక్టర్ : ఖత్రోన్ కే ఖిలాడి, బిగ్ బాస్ సీజన్-11 లో పాల్గొంది. రెండింటిలోనూ రన్నర్ గా నిలిచింది. గత ఏడాది 'లైన్స్' సినిమాతో సందడి చేసింది. ఆమె తాజా చిత్రం Country of Blind రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇటీవల జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. H.G. వెల్స్ నవల 'ది కంట్రీ ఆఫ్ ది బ్లెండ్' ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఇది. 1800 నాటి కాలంలో ఓ లోయలో నివసించే అంధుల జీవిత కథగా రాబోతుంది. ఈ చిత్రానికి రహత్ కాజిమ్ దర్శకత్వం వహి స్తున్నారు. ఇందులో హీనా కపూర్ అంధురాలిగా కనిపించ నుంది.