విశ్వక్ సేన్ హీరోగా నటించిన సినిమా 'అశోకవనంలో అర్జున కళ్యాణం' ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించింది. తాజాగా విశ్వక్ సేన్ మరో కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించారు. ఈ సినిమాకి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాని శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై అర్జున్ నిర్మిస్తున్నరు.