తలపతి విజయ్ హీరోగా నటిస్తున్న సినిమా 'తలపతి 66'. ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయినిగా నటిస్తుంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా 'తలపతి 66' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను జూన్ 21వ తేదీ సాయంత్రం 18.01 గంటలకు విడుదల చేయనున్నట్లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించి ఒక పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు.