గతేడాది సెప్టెంబర్ లో ఘోరప్రమాదానికి గురైన మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, ఇటీవలే తన కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేసాడు. సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న, ఇంకా టైటిల్ లాక్ చెయ్యని ఈ సినిమాలో సాయిధరమ్ లీడ్ రోల్ లో నటిస్తున్నాడు. ఇది సాయిధరమ్ కు 15వ సినిమా అందుకే, SDT 15 అని పిలుస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ దండు డైరెక్టర్.
ఈ ప్రాజెక్ట్ సెట్స్ పై ఉండగానే తేజ్ మరో సినిమాను ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచాడు. రామ్ చరణ్ కెరీర్ లో మంచి కమర్షియల్ హిట్ గా నిలిచిన "రచ్చ" సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరించిన సంపత్ నంది తో తేజ్ తన 16వ సినిమా చేయనున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులను జరుపుకుంటున్న ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.