ఆర్ ఆర్ ఆర్ తో సూపర్ సక్సెస్ ను అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి సినిమాలపై మరింత బాధ్యత వహిస్తున్నాడు. ఈ సినిమాతో అన్ని భాషలలో వచ్చిన పాజిటివ్ బజ్ ను అలానే మెయింటైన్ చెయ్యాలని అనుకుంటున్నాడట.
ప్రస్తుతం తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ తో ఒక సినిమా చేస్తున్నాడు చరణ్. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్. రామ్ చరణ్ కెరీర్లో ఇది 15 వ చిత్రం. RC#15 వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ సినిమాలో చెర్రీ డ్యూయల్ రోల్ లో ప్రేక్షకులను పలకరించనున్నాడని టాక్. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్టూడెంట్ గా, రాజకీయనాయకుడిగా, ప్రుభుత్వోద్యోగిగా, సామాన్యుడిగా నాలుగు విభిన్నమైన పాత్రలను చరణ్ పోషిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవలనే పంజాబ్ షెడ్యూల్ ని పూర్తి చేసిన #RC15 చిత్రయూనిట్ తాజాగా వైజాగ్ లో చిత్రీకరణ జరపనున్నారు.
ఈ మూవీ టైటిల్ పై గత కొన్నిరోజులుగా మీడియాలో ఒక రేంజులో వార్తలు వస్తున్నాయి. 'సర్కారోడు', 'ఆఫీసర్', 'అధికారి' వంటి పలు రకాల టైటిల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న తరుణంలో ఒక న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే.... టైటిల్ విషయంలో చెర్రీ, దిల్ రాజు, శంకర్ మధ్య తర్జన భర్జనలు జరుగుతున్నాయట. ముగ్గురికి మూడు వేర్వేరు టైటిల్స్ నచ్చడంతో టైటిల్ ఫైనలైజ్ చేసే విషయంలో ఆలస్యమవుతుందట. చెర్రీకి అధికారి, దిల్ రాజుకు సర్కారోడు, శంకర్ కు ఆఫీసర్ టైటిల్స్ నచ్చాయంట. ఈ మూడిట్లో చెర్రీ సెలక్ట్ చేసిన అధికారి టైటిల్ క్లాస్సి టచ్ తో మాస్ ఇమేజ్ టైటిల్ గా ఉంది. సో.... ఈ టైటిల్ నే సినిమాకు ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి... ఫ్యూచర్ లో RC 15కు ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారో!