బాలీవుడ్ స్టార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్, టెలివిజన్ హోస్ట్ అయిన కరణ్ జోహార్ బుల్లితెరపై చేస్తున్న టాక్ షో కాఫీ విత్ కరణ్. 2004లో ప్రారంభమైన ఈ టాక్ షో 2019 వరకు స్టార్ వరల్డ్, స్టార్ వన్ ఛానెళ్లలో నిర్విరామంగా ప్రసారం చేయబడింది. నటీనటులు వారి కొత్త సినిమా విడుదలయ్యే తరుణంలో ఈ టాక్ షోలో పాల్గొని కాఫీ తాగుతూ సినిమా ముచ్చట్లను చెప్పుకుంటారు. బాలీవుడ్ లో ఈ షో సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ మధ్యకాలంలో సౌత్ సెలెబ్రిటీలు నార్త్ లో సత్తా చాటుతున్నారు. కొంతమంది సౌత్ సెలెబ్రెటీలకు ఉత్తరాదిన భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో ఈసారి కరణ్ తో కాఫీ తాగే ఛాన్స్ మనోళ్లకు కూడా దక్కింది.
కాఫీ విత్ కరణ్ కొత్త సీజన్ ఈసారి ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది. ఈ షో లో పాల్గొనే సెలెబ్రిటీల లిస్టును కరణ్ ఆల్రెడీ సిద్ధం చేసిపెట్టాడు. తారక్, చెర్రీ, రష్మిక, విజయ్, సమంత, నయన్ వంటి టాప్ సెలెబ్రిటీలు ఈ షోకు హాజరు కానున్నారు. లైగర్ హీరోహీరోయిన్లు విజయ్ దేవరకొండ, అనన్యా పాండే ఒక ఎపిసోడ్ లో, క్రేజీ హీరోయిన్ సమంత మరో ఎపిసోడ్ లో కనిపిస్తారని, అందుకు సంబంధించిన షూటింగ్ కూడా ఇటీవలే పూర్తయిందని వార్తలు వస్తున్నాయి. పోతే... ఈ షో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటిటిలో వచ్చే నెల 7వ తేదీ నుండి టెలికాస్ట్ అవ్వనుంది. సౌత్ సెలెబ్రిటీల రాకతో ఈసారి ఈ షో మరింత సక్సెస్ అవ్వనుందని తెలుస్తుంది. ఎందుకంటే, ఇప్పటినుండి కాఫీ విత్ కరణ్ షో కోసం సౌత్ ఆడియన్స్ కూడా ఎదురుచూస్తున్నారు మరి.