మొండేటి దర్శకత్వంలో హీరో నిఖిల్ సిద్ధార్థ్ తన సూపర్ హిట్ మూవీ కార్తికేయ సీక్వెల్ తో మళ్లీ ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనన్, శ్రీనివాస రెడ్డి మరియు హర్ష చెముడు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కార్తికేయ 2 జూలై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన మోషన్ పోస్టర్‌కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో టీజర్‌ని రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. తాజాగా ఓ ప్రకటన వెలువడింది. టీజర్ జూన్ 22 న విడుదల కానుంది.