"ఉప్పెన" సినిమాతో హీరో గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ తన నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. తాజగా ఇప్పుడు తన 4వ ప్రాజెక్ట్ ని ఇటీవలే నూతన దర్శకుడు శ్రీకాంత్‌తో చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని, వైష్ణవ్ తేజ్ డైనమిక్ మోడ్ లో కనిపిస్తారని మూవీ మేకర్స్ వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ ని ప్రముఖ నిర్మాణ బ్యానర్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగ వంశీ భారీ స్థాయిలో నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 22 నుంచి ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa