"గూఢచారి" మూవీ కాంబోలో వచ్చిన లేటెస్ట్ సినిమా "మేజర్". శశికిరణ్ తిక్కా డైరెక్షన్లో యంగ్ హీరో అడవిశేష్ నటించిన ఈ చిత్రం ఎందరో భారతీయుల హృదయాలను కదిలించింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా తెరకెక్కిన ఈ మూవీ ఇటీవల విడుదలై అన్ని భాషల్లో సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతుంది. ఈ సినిమాపై పలువురు సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు తమ అభిప్రాయాన్ని తెలుపుతూ సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెట్టారు.
తాజాగా మేజర్ సినిమాపై తన అభిప్రాయాన్ని తెలుపుతూ ఇండియన్ మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేసారు. మేజర్ సినిమాను ఇటీవలే చూశానని, మేజర్ సినిమా కాదు .... హృదయాలను కదిలించే అద్భుతమైన ఎమోషన్ అని, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఎందరికో ఆదర్శవంతంగా ఉందని, అడవిశేష్ సినిమాను వేరే స్థాయికి తీసుకెళ్లారని, అందరు తప్పకుండా చూడవలసిన సినిమా అని ట్వీట్ లో పేర్కొన్నారు. లక్ష్మణ్ చేసిన ట్వీట్ కు అడవిశేష్ కృతజ్ఞతలు తెలుపుతూ రీట్వీట్ చేసారు.