రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జిహెచ్ఎంసీ పార్క్ లో మొక్కలు నాటిన విరాటపర్వం చిత్ర దర్శకుడు వేణు ఉడుగుల, నటుడు నవీన్ చంద్ర , సినిమాటోగ్రాఫర్ డాని. ఈ సందర్భంగా దర్శకుడు వేణు ఉడుగుల, నటుడు నవీన్ చంద్ర మాట్లాడుతూ గ్రీన్ఇండియా చాలెంజ్ ఐదో వసంతం లోకి అడుగుపెట్టినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాల ద్వారా తెలంగాణ లో పచ్చదనం పెరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు