రౌడీ హీరో విజయ్ దేవరకొండ తొలిసారిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం "లైగర్". డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శక నిర్మాణంలో భారీ స్కేల్ మీద రూపొందుతున్న ఈ మూవీలో విజయ్ కు జోడిగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యా పాండే నటిస్తుంది. ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యిందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, హిందీలో లైగర్ కు నిర్మాతగా వ్యవహరిస్తున్న కరణ్ జోహార్ అతిజోక్యం వల్ల ప్రమోషన్స్ ఆలస్యమవుతున్నాయని నిన్నటి వరకు ప్రచారం జరిగింది. ఇదివరకెన్నడూ లేని విధంగా ఈ సినిమా కోసం పూరి దాదాపు తొమ్మిది నెలల పాటు వేచి చూస్తున్నాడని, ఇందుకు కారణమైన కరణ్ ను చాలామంది విమర్శించారు కూడా.
కానీ వాస్తవమేంటంటే, లైగర్ మూవీ షూటింగ్ ఇంకా పూర్తవ్వలేదట. ఆఖరి పాట షూట్ మిగిలిపోయిందట. ఇప్పుడు ఈ పాటను పూర్తి చేసేందుకు గానూ లైగర్ టీం మొత్తం ముంబైలో చేరింది. ముంబైలో వేసిన భారీ సెట్టింగ్స్ లో విజయ్, అనన్య లపై ఈ పాట ను షూట్ చేస్తున్నారట పూరి. ఈ పాటను త్వరగా చిత్రీకరించి, ఇక ఆలస్యం చెయ్యకుండా ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యాలని అనుకుంటున్నారట. ఈ కారణం చేతనే పూరి చోర్ బజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాలేకపోయాడట.
![]() |
![]() |