ఈ నగరానికి ఏమైంది, పెళ్లి చూపులు వంటి చిత్రాలతో టాలీవుడ్ డైరెక్టర్లలో విభిన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు తరుణ్ భాస్కర్. కెరీర్లో చేసింది రెండు సినిమాలే అయినా తరుణ్ కున్న క్రేజే వేరు. ఐదు సంవత్సరాల విరామం తర్వాత ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను నిన్ననే ఎనౌన్స్ చేసారు. VG సైన్మా మొట్టమొదటి ప్రొడక్షన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు "కీడాకోలా" టైటిల్ ను ఎనౌన్స్ చేస్తూ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ పోస్టర్లో ఆసక్తిని రేకెత్తించే విషయమేంటంటే, తరుణ్ మొదటి రెండు సినిమాల పోస్టర్లు ఎల్లో కలర్ బ్యాక్ గ్రౌండ్ లో డిజైన్ చెయ్యగా, తాజాగా విడుదలైన కీడాకోలా కూడా అదే తరహాలో ఉండడం విశేషం. దీంతో తరుణ్ ఎల్లోకాలర్ సెంటిమెంటును ఫాలో అవుతున్నాడంటూ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. గతంలో తననుండి వచ్చిన సినిమాల లాగానే ఇది కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని తరుణ్ ఆరాటపడుతున్నట్టు ఈ పోస్టర్ డిజైన్ బట్టే క్లియర్ గా తెలుస్తుంది.
పోతే... ఈ సినిమాను భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ, శ్రీనివాస్ కౌశిక్, సాయికృష్ణ గద్వాల్, విజయ్ కుమార్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాదిలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి త్వరలోనే తెలుపుతామని చెప్పారు.