డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ నటవారసుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు ఆకాష్ పూరి. ఆకాష్ నటిస్తున్న కొత్త చిత్రం చోర్ బజార్. జీవన్ రెడ్డి డైరెక్షన్లో యూత్ ఫుల్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో ఆకాష్ సరసన కొత్తమ్మాయి గెహన సిప్పి కథానాయికగా నటించింది. థియేటర్లలో ఈరోజే విడుదలైంది.
విడుదలకు ముందు ఈ సినిమా నుండి ఒక్కొక్కటిగా లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేసారు మేకర్స్. వాటిలో "బచ్చన్ సాబ్" పాట బాగా హిట్ అయ్యింది. ఈ పాటలో హీరో అమితాబ్ బచ్చన్ కు వీరాభిమాని. ఆయనపై అభిమానాన్ని వర్ణిస్తూ పడే పాటే ఇది. ఈ పాటకు మదీన్ షేక్ సంగీతం అందించగా, మంగ్లీ ఆలపించారు. మిట్టపల్లి సురేందర్ సాహిత్యమందించారు. ఈ ఫ్యాన్ యాంథెం తాజాగా అమితాబ్ బచ్చన్ ట్వీట్ చెయ్యడం విశేషం. "ఉఫ్..... ఏం చెప్పాలి... చాలా సంతోషంగా ఉంది..." అని ట్వీట్ చేసారు. దీనిపట్ల చోర్ బజార్ మూవీ టీం ఆనందం వ్యక్తం చేస్తుంది. బచ్చన్ ట్వీట్ తో ఈ సినిమాకు, బచ్చన్ సాబ్ పాటకు మరింత పాపులారిటీ దక్కింది.